కేసీఆర్ ను ఢీకొడుతున్న రెడ్డి – కొత్త పార్టీ రెడీ?

0
4198
kodandaram new party name

Posted [relativedate]

తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నికపై మ‌రో రాజ‌కీయ పార్టీ అడుగు పెట్ట‌బోతుందా? ప‌్ర‌భుత్వంపై పోరాడగ‌లిగే స‌రైన రాజ‌కీయ పార్టీ అదే కాబోతుందా? కాంగ్రెస్ , టీడీపీల నుంచి మించిన రాజ‌కీయ శ‌క్తిగా ఆ పార్టీ ఎద‌గ‌బోతుందా? స‌రికొత్త పార్టీ ఆవిర్భానికి ఇదే స‌రైన త‌రుణామా? టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ దానికి నాయ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

నిజానికి కోదండ‌రామ్ ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన నాయ‌కుడు కాక‌పోయిన‌ప్ప‌టికీ … తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల కంటే కూడా ఆయ‌నే బ‌లంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ త‌ప్పుల‌ను ఎండ‌గ‌డుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల కంటే దీటుగా ప్ర‌భుత్వంపై పోరాడుతున్నారు. అది ప్రాజెక్టుల అంశ‌మైనా, డ‌బుల్ బెడ్ రూం అంశ‌మైనా, సీఎం క్యాంప్ ఆఫీస్ సంగ‌తైనా… అందుకే ఇప్పుడు తెలంగాణ‌లో ఆయ‌న్నే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా చెబుతున్నారు చాలామంది. పేరుకు కాంగ్రెస్ మెయిన్ అపోజిష‌న్ అయినా.. కోదండ‌రామ్ ఒక్క‌డే ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు. మీడియాలోనూ కోదండ‌రామ్ మాట‌లు ఎక్కువ ఫోక‌స్ అవ్వ‌డంతో టీఆర్ఎస్ కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లను గుప్పిస్తోంది. టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు శృతిమించ‌డంతో కోదండ‌రామ్ కూడా ఇక ఢీ అంటే ఢీ అనాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే కొత్త రాజ‌కీయ పార్టీ దిశ‌గా ఆయ‌న అడుగులేస్తున్నార‌ని స‌మాచారం.

కొత్త రాజ‌కీయ పార్టీతో కేసీఆర్ ను ఢీకొట్టేందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామాను కోదండరామ్ సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఈ పార్టీలో తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. తెలంగాణ‌లోని బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ‌మైన రెడ్లతో పాటు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలన్నింటికీ అందులో స్థానం ఉండేలా ప్రిప‌రేష‌న్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. అందుకు సంబంధించి ఇప్ప‌టికే కొంత‌మంది నాయ‌కుల పేర్లు కూడా ఫైన‌ల్ అయిపోయాయ‌ని తెలుస్తోంది.
రాజ‌కీయ పార్టీతో పాటు న్యూస్ పేప‌ర్ ను కూడా తీసుకురావాల‌ని కోదండ‌రామ్ ఆలోచిస్తున్నార‌ట‌. దాంతో పాటు యూ ట్యూబ్ ఛాన‌ల్ కూడా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఆదిశ‌గా వేగంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

Leave a Reply