తెలంగాణాలో ఆంధ్ర పాలనే ..కోదండరాం

Posted December 12, 2016

kodandaram says on telangana govt ruling development not wellసీమాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి విధ్వంసకర విధానాలనే తెలంగాణ పాలకులూ అనుసరిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు ఇదేం అని అడిగితె పాలకులకి బూతు గా వినిపిస్తోందని అన్నారు. ఖమ్మంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి సమావేశం అయన ఈ కామెంట్ చేసారు .

తెలంగాణ వచ్చాక పాలకులు మారారే తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి త్వరలోనే విద్యాయాత్ర చేపడతామని అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణా సి ఎమ్ చంద్రశేఖర రావు కి కోదండ రామ్ కి గ్యాప్ వున్నా సంగతి తెలిసిందే ..ఈ కామెంట్ వెనుక అంతరార్ధము ఏమిటో ..?

SHARE