కోడెలకు ఆ బాధకు మించిన సంతోషం

0
628

రాష్ట్రం విడదీసినప్పుడు ఎంత భాధ కలిగిందో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ని చూస్తే అంత సంతోషంగా ఉందన్నారు ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో నిర్వహించిన మహ సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ మూడు సంవత్సరాల్లో 24గంటల విద్యుత్, గోదావరి జలాలు కృష్ణాలో కలపడం, పెట్టుబడులు, పోలవరం నిర్మాణం, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం వంటి ఎన్నో విజయాలు సాధించామన్నారు.పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే ఏపీ అనుకూలమైన రాష్ట్రంగా కేంద్రం, సెంట్రల్ బ్యాంకు వెల్లడించాయంటే ఆ ఘనత రాష్ట్రానికి ఏపీ సీఎం చంద్రబాబు కి దక్కుతుందన్నారు.

రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధి లో దూసుకుపోతుందన్నారు.రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంపై వివక్ష లేకుండా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని ఉద్యోగుల కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించిన అవినీతి జరుగుతుందన్నారు.ఇలాంటి అవినీతిని పారదోలడానికి చంద్రబాబు హెల్ప్ లైన్ ప్రవేశ పెట్టారన్నారు.రాబోయే కాలంలో యంత్రాంగం పట్టుదలతో అవినీతి లేకుండా పనిచేస్తే మరింత వేగంగా దూసుకెళ్తాం అన్నారు.జపాన్, సింగపూర్ ప్రజలు వాళ్ల దేశం కోసం పనిచేస్తారని అందుకే వాళ్లు సంక్షోభాలు సైతం అధిగమించి అభివృద్ధి లో దూసుకుపోతున్నారన్నారు.మన ఉద్యోగులు, ప్రజలు కూడా రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మహ సంకల్పం ప్రతిజ్జ చేశారు

Leave a Reply