కాంగ్రెస్ తో కోదండరామ్ డీల్?

0
343
kodhandaram deal with congress

Posted [relativedate]

kodhandaram deal with congress
కాంగ్రెస్ కు కోదండరామ్ అండగా ఉంటున్నారా ? ఆ పార్టీకి ఏజెంటుగా ఆయన వ్యవహరిస్తున్నారా? అంటే ఔననే విమర్శలు వస్తున్నాయి టీఆర్ఎస్ నుంచి. కోదండరామ్ కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్నారని ఇప్పుడా పార్టీ ఒక రేంజ్ లో ఫైర్ అవుతోంది.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ అంటేనే కోదండరామ్ ఉలిక్కిపడేవారు. తెలంగాణ విషయంలో హస్తాన్ని ఓ రేంజ్ లో ఏకిపారేసే వారు. కానీప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన కాంగ్రెస్ ను తిట్టడం మానేశారు. టీఆర్ఎస్ పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ కంటే కూడా కోదండరాం అంటేనే గులాబీదళం భయపడుతోంది. ఆయన సూటిగా.. సుత్తి లేకుండా.. గణాంకాలతో సహా చేస్తున్న విమర్శలకు టీఆర్ఎస్ నుంచి సరైన ఆన్సర్ రావడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఇక ప్రొఫెసర్ గారిపై స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఇక ఆయన్ను లైట్ తీసుకోకుండా రిటర్న్ కౌంటర్ ఇవ్వాలని గులాబీ పెద్దలు.. పార్టీ నేతలకు సిగ్నల్స్ ఇచ్చారట. అందులో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సుమన్ కోదండ సార్ పై విమర్శలు చేశారు. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ లా మారిపోయారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నట్టుగా కోదండరామ్-కాంగ్రెస్ మధ్య ఏమైనా డీల్ కుదిరిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకులతో స్టేజీలపై కూర్చుంటున్నారు. నిరసన కార్యక్రమాల్లో వారితో కలిసి పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ మధ్య కాంగ్రెస్ నేతలకు కావాల్సిన గణాంకాల చిట్టా.. ప్రొఫెసర్ గారి ఇంటి నుంచే వెళ్తోందని టాక్. అయితే వాడుకొని వదిలేసే అలవాటున్న కాంగ్రెస్.. కోదండరామ్ నూ అలాగే వాడుకొని వదిలేస్తుందంటున్నారు తెలంగాణవాదులు. ప్రొఫెస‌ర్ గారు!! జ‌ర జాగ్ర‌త్త అని సూచిస్తున్నారు.

Leave a Reply