అథ్లెట్లలో స్ఫూర్తి రగిలిస్తున్న కోహ్లీ …

0
597

  kohli inspirational video for olympics athletes

ఇండియా  టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ… రియోలో పోరాడుతున్న భారత అథ్లెట్లలో స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ డ్రింక్ సహాయంతో రూపొందించిన ఓ వీడియోలో నటించాడు కోహ్లీ. క్రికెట్ ను మతంగా భావించే ఈ దేశంలో.. క్రికెట్ వెంట పరిగెత్తే జనం మధ్యలో మీతోడు నేనున్నా అంటూ.. అథ్లెట్లలో స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేశాడు.

ప్రపంచస్థాయి ర్యాంకులున్న అథ్లెట్లు.. నిరాశను ఛేదించుకుంటూ.. చరిత్రను సృష్టించే దిశగా.. దేశం కోసం ఆడుతున్నారంటూ మనస్సుకు తాకేలా రూపొందించారు వీడియో. ఈ వీడియో క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు ఈ వీడియోను. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

[wpdevart_youtube]jnPchelym58[/wpdevart_youtube]

Leave a Reply