దుమ్ము దులిపిన కోహ్లీ సేన… వర్షం బ్రేక్..?

0
657

kohli-sena-super-innings-ra

కింగ్‌స్టన్‌ వేదికగా ఇండియా-వెస్టిండీస్‌ నాలుగో రోజు టెస్ట్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకీగా మారింది. దీంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.అయితే ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. మంగళవారం కూడా వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో నాలుగో రోజు కేవలం 15.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. లంచ్ విరామానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులు చేసింది.

బ్లాక్‌వుడ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత్ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. తీవ్ర వర్షం కారణంగా లంచ్ తర్వాత మ్యాచ్ జరగలేదు. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో అంపెర్లు నాలుగో రోజు ఆట నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెస్టిండీస్‌కు భారీ ఊరట లభించింది. ఈ మ్యాచ్ ఫలితానికి ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది. వర్షం నిలిచిపోతే తప్ప భారత్‌కు విజయం ఖాయమని చెప్పాలి.

మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు బ్రాత్‌వైట్, చంద్రిక ఇన్నింగ్స్‌ను ఆరంభించగా… మూడో ఓవర్‌లోనే ఇషాంత్‌ శర్మ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. అద్భుత బౌలింగ్‌తో చంద్రికను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌ దిగిన బ్రావో, బ్రాత్‌వైట్‌ లు రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత బౌలింగ్‌ ధాటికి వారి ప్రయత్నం ఫలించలేదు. మిశ్రా బౌలింగ్‌లో బ్రాత్‌వైట్(23) ఔటయ్యాడు. వెంటనే శామ్యూల్స్‌(0)ను షమి ఔట్ చేశాడు. దీంతో విండీస్ 41 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకుంటాడనుకున్న బ్రావో(20) కూడా వెనువెంటనే షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు, మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. మంగళవారం వర్షం అంతరాయం లేకపోతే మ్యాచ్ విజయం భారత్‌ ఖాతాలో చేరేది. ఇప్పటికే నాలుగు టెస్టులు సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 1/0 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 304 పరుగుల ఆధిక్యం లభించింది.

Leave a Reply