షాక్ : ఎన్టీఆర్ ఎవరో తెలియదట..!

0
579
Kollywood Director Insults Ntr ..

Posted [relativedate]

Kollywood Director Insults Ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉంటారా చెప్పండి. తెలుగు సినిమా చరిత్రలో నూనుగు మీసాల వాడిగా ఉన్నప్పుడే రికార్డుల పని పట్టిన ఈ సింగమలై గురించి తమిళ దర్శకుడు టంగ్ స్లిప్ అయ్యాడు. సింగం సీరీస్ లతో సూపర్ సక్సెస్ అయిన మాస్ కమర్షియల్ డైరక్టర్ హరి ప్రస్తుతం సూర్య ఎస్-3 రిలీజ్ కు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన హరి త్వరలో తారక్ తో సినిమా తీస్తారన్న టాక్ రాగా అదే ప్రశ్నను తన దగ్గర ప్రస్థావించారట.

అయితే ఎన్టీఆర్ తోనా అతనెవరో కూడా తనకు తెలియదు అన్న రేంజ్లో మాట్లాడాడట హరి. మరి తమిళ డైరక్టర్ కు అంత బిల్డప్ ఎందుకో ఏంటో.. తెలుగు సినిమాల బిజినెస్ తో చంకలు గుద్దుకుంటున్న దర్శక నిర్మాతలు ఇక్కడ స్టార్ హీరో పేరు కూడా తెలియకుండా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారా అని తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. మనోడి తెలిసి అన్నాడో తెలియక అన్నాడో కాని ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సూర్య ఎస్-3 సినిమా మీద పడక మానదు.

మరి తొందరగా ఈ విషయం మీద హరి క్లారిటీ ఇస్తే బెటర్ లేదంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన జూనియర్ పై ఇలాంటి షాకింగ్ కామెంట్ చేయడం ఒక్కసారిగా ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Leave a Reply