జగదీష్ రెడ్డికి మంత్రి పదవి అలా వచ్చిందా..?

0
417
komatireddy rajagopal reddy comments on guntakandla jagadish reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

komatireddy rajagopal reddy comments on guntakandla jagadish reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బత్తాయి మార్కెట్ ప్రారంభం సందర్భంగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగిన దాడి విషయంలో తగు చర్యలు లేకపోవడంపై విలేకరుల సమావేశం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ సహా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను ఒక రాజులా తెలంగాణ తన రాజ్యంలా భావిస్తూ పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

ప్రతి రోజు కేసీఆర్ కు మద్యం పోసి దగ్గరై మంత్రి అయిన జగదీశ్ రెడ్డి తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు పెగ్ పోయడానికి తప్ప మంత్రిగా గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పనికిరాడని ఎద్దేవా చేశారు.మంత్రి జగదీశ్ రెడ్డి అండతో ఎమ్మెల్యే గాదరి కిషోర్ 37 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించాడని అన్నారు. ఇందులో 26 మంది మహిళలు కూడా ఉన్నారని వారు పోలీసులపై దాడి చేశారని కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్లగొండలో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనా మంత్రి జగదీశ్ రెడ్డి ఇదే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్లు టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలుగా పోలీసులు పార్టీ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ నేతలు ఇసుక మాఫియా దొంగనోట్ల చెలామణి గూండాయిజం రౌడీయిజంతో వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. గ్యాంగ్ స్టర్ నయీమ్ తో అంటకాగిన నేతలు అధికారులు పోలీసులను వెంటనే అరెస్టు చేయకపోతే భువనగిరి నుంచి లక్ష మందితో హైదరాబాద్ కు పాదయాత్రగా వచ్చి సీఎం కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.

Leave a Reply