దమ్ముంటే అరెస్ట్ చెయ్యి… కెసిఆర్ కి సవాల్

Posted September 29, 2016

  komatireddy venkat reddy challenge kcr nayeem case

నయీమ్ వ్యవహారంలో తనపై వస్తున్న విమర్శలకు కోమటిరెడ్డి వెంకటిరెడ్డి ధీటుగా స్పందించారు. బెదిరించడానికే TRS అనుకూల పత్రికల్లో తనతో నయీమ్ కి సంబంధాలున్నాయని రాస్తున్నట్టు ఆయన చెప్పారు. నిజంగా సాక్ష్యాలుంటే, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఆయన కెసిఆర్ సర్కార్ కి సవాల్ విసిరారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ప్రచారం సాగిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు.

నయీమ్ వ్యవహారంలో పాత సంగతుల్ని కూడా కోమటిరెడ్డి జర్నలిస్టులతో ప్రస్తావించారు. తాను మంత్రిగా వున్నప్పుడు నయీమ్ అక్రమాల్ని అడ్డుకోడానికి ప్రయత్నించానని ఆయన తెలిపారు. అందుకే నయీమ్ కూడా తనపై కక్షగట్టాడని, … అలాంటి వాడితో సంబంధాలు అంటగట్టడం వెనక దురుద్దేశాలున్నాయని కోమటిరెడ్డి డౌట్ వ్యక్తం చేశారు.

SHARE