తెలుగులో ఇంకో న్యూస్ ఛానల్…ఎవరి కొమ్ము కాస్తుందో?

Posted April 14, 2017

komatreddy brothers raj news channel
డిజిటల్ మీడియా ఉధృతికి తెలుగులో చాలా వరకు న్యూస్ ఛానెళ్ళు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.ఎక్స్ ప్రెస్ టీవీ లాంటివి మూతపడగా,మరి కొన్ని న్యూస్ ఛానెళ్ళు మూడు నాలుగు నెలలకోసారి జీతాలు ఇస్తూ నెట్టకొస్తున్నాయి.ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులకి కొత్తకొత్తగా వస్తున్న వెబ్ సైట్స్,యు ట్యూబ్ ఛానెళ్ళు ఎంతోకొంత ఆసరాగా నిలుస్తున్నాయి.ఈ టైం లో ఓ న్యూస్ ఛానల్ బరిలోకి దిగుతోంది.కష్టమని తెలిసి కూడా ఇష్టంగా ఛానల్ నడపాలని కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగారు.రాజ్ న్యూస్ సారధ్య బాధ్యతల్ని మూడేళ్ళ పాటు తలకెత్తుకున్నారు.ఈ లీజ్ ఒప్పందంలో రాజ్ మ్యూజిక్,విస్సా ఛానల్ కూడా కలిసి ఉంటాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్ సారధ్యంలో వస్తున్న ఈ న్యూస్ ఛానల్ సన్నాహక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.2019 ఎన్నికల నాటికి న్యూస్ విభాగంలో రాజ్ న్యూస్ ప్రభావశీలంగా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు,కోమటిరెడ్డి బ్రదర్స్ ఛానల్ ఆలోచన చేసేటప్పుడు కాంగ్రెస్ కి అండగా వుండాలని,ఆ పార్టీ లో తమ హవా కొనసాగుతుందని వాళ్ళు అనుకున్నారు.అయితే అదంత తేలిక కాదని అర్ధమైంది.అందుకే ఆ బ్రదర్స్ ని దగ్గర చేర్చుకోడానికి బీజేపీ ఇంటరెస్ట్ చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండా ఛానల్ పనుల్లో నిమగ్నమయ్యారు.ఆ ఛానల్ లో తీసుకునే స్టాండ్ భవిష్యత్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎటు వుంటారో చెప్తుందేమో..

SHARE