సీనియ‌ర్ల‌కు కోమ‌టిరెడ్డి బ‌ద్ర‌ర్స్ వ‌ల‌!!!

0
273
komatreddy brothers trapping seniors

Posted [relativedate]

komatreddy brothers trapping seniors
తెలంగాణ కాంగ్రెస్ లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వేగం పెంచారు. పీసీసీ ప‌గ్గాల కోసం లైన్ క్లియ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇందుకోసం సీనియ‌ర్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లూ అంటీముట్ట‌న‌ట్టుగానే ఉన్న జానారెడ్డితో స‌ఖ్య‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎందుకంటే పీసీసీ చీఫ్ ప‌ద‌వి రావాలంటే జానారెడ్డి మ‌ద్ద‌తు చాలా కీల‌కం. అందుకే చాలా తెలివిగా ఆయ‌న‌ను త‌మ దారి లోకి తెచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నార‌ట‌.

జానారెడ్డి విష‌యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తే సీఎం అభ్య‌ర్థి ఆయ‌నేనంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేట్ మెంటుతో అటు పెద్దాయ‌న కూడా బాగా ఇంప్రెస్ అయిపోయార‌ట‌. ఎలాగూ ఉత్త‌మ్ తో పార్టీ ప‌రిస్థితిలో మార్పు రావ‌డం లేదు కాబ‌ట్టి… నాయ‌క‌త్వ మార్పు జ‌ర‌గాలని ఆయ‌న కూడా కోరుకుంటున్నార‌ని టాక్.

జానారెడ్డితో పాటు సీనియ‌ర్ నేతలుగా ఉన్న ష‌బ్బీర్ అలీ, భ‌ట్టి విక్ర‌మార్క లాంటి వారితోనూ కోమ‌టిరెడ్డి బ‌ద్ర‌ర్స్ ఇప్ప‌టికే మాట్లాడార‌ట‌. పీసీసీ చీఫ్ ప‌ద‌వి రావ‌డానికి స‌హ‌క‌రించాల‌ని కోరార‌ట‌. అటు ఎమ్మెల్యేలతోనూ విష‌యం చెప్పార‌ట‌. దీంతో ఉత్త‌మ్ వ్య‌తిరేకులుగా ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు … ఈ నల్గొండ సోద‌రుల‌కే మ‌ద్ద‌తిస్తామ‌ని భ‌రోసా ఇచ్చార‌ని టాక్.

మొత్తానికి అటు హైక‌మాండ్ ద‌గ్గ‌ర గ‌ట్టి లాబీయింగ్ చేస్తున్న కోమ‌టిరెడ్డి సోద‌రులు.. ఇక్క‌డ రాష్ట్ర కాంగ్రెస్ పైనా ప‌ట్టు సాధించేందుకు ప‌క్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. వీరి దూకుడు చూస్తుంటే… ప‌ద‌వి ఖాయ‌మైపోయిందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. అలా అయినా కాంగ్రెస్ కు క‌లిసి వ‌స్తుందేమోన‌ని ఆ పార్టీ నాయ‌కులు చాలామంది బ‌లంగా న‌మ్ముతున్నారు. మ‌రి నిజంగానే పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఆ కుటుంబానికి ద‌క్కుతుందా… లేదా అన్న‌ది కాంగ్రెస్ పెద్ద‌ల చేతుల్లోనే ఉంది!!!

Leave a Reply