పోలీసుల చేతిలో హతమైన నయీమ్ గురించి రోజుకో ఆరోపణ చూశాం.ఇప్పటిదాకా మాజీల మీద ఆరోపణలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.అయితే తాజా అస్త్రం నేరుగా అధికార పార్టీకే గురిపెట్టింది కాంగ్రెస్.ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆదిలాబాద్ రైతు గర్జన సభలో సంచలన ఆరోపణ చేశారు.నయీమ్ ని తమ ప్రయోజనాల కోసం టీయారెస్ వాడుకొందని అయన ధ్వజమెత్తారు.
ఆ అండ చూసుకొనే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనను పోటీ నుంచి తప్పుకోవాలని నయీమ్ బెదిరించినట్టు రాజగోపాల రెడ్డి ఆరోపించారు.పోటీ చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు చెప్పారు.రాజగోపాలరెడ్డి ఆరోపణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇప్పటిదాకా వచ్చిన లీకులు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడితే తాజా డైలాగ్ తో సీన్ రివర్స్ అయ్యింది .దీనిపై అధికార పార్టీ ఎలా స్పందింస్తుందో చూడాలి.