సాక్షి మనసులోమాటకి సరేఅనేదెవరు?

Posted October 5, 2016

  kommineni srinivasa rao manasulo maata program congress leader dk aruna told jagan

మనసులో మాట పేరుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో ప్రముఖులతో ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఆ కార్యక్రమంలో అతిథులతో ఏపీ సర్కార్ ని ముఖ్యంగా సీఎం చంద్రబాబుని విమర్శించడానికి …జగన్ ని పొగడ్డానికి వీలుగా ప్రశ్నలు రూపకల్పన చేస్తున్నారు.దాని ద్వారా ఎంతోకొంత వైసీపీ కి లబ్ది చేకూర్చుదామని ప్లాన్ అయితే అది రివర్స్ అవుతోంది.సాక్షి పాచిక కొంతవరకు పారినా అసలు విషయం జగన్ దగ్గరకొచ్చేసరికి సాక్షి పప్పులు ఉడకడంలేదు.

తమిళనాడు గవర్నర్ గా పని చేసొచ్చిన రోశయ్య మనసులోమాటకి వచ్చినపుడు వై.ఎస్ వ్యవహారశైలిపై ప్రశంసలు కురిపించారు.బాబు సర్కార్ మీద విమర్శలు చేయడానికి ఆసక్తి చూపలేదు.ఇక జగన్ విషయంలోనూ అయన కాంగ్రెస్ లో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ రాజకీయాల గురించి దూకుడుగానే మాట్లాడారు.ఇద్దరు చంద్రులు కుమ్మక్కయ్యారని,వై.ఎస్ గొప్ప నాయకుడని పొగిడారు.అయితే జగన్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ ది కక్షసాధింపు కాదని వివరించారు.జగన్ ని తొందరపడొద్దని చెప్పినా వినలేదన్నారు.ఇదంతా చూస్తున్న వాళ్ళు సాక్షి మనసులోమాటకి సరే అనే అతిథుల్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదిగా అని సలహా ఇస్తున్నారు.

SHARE