జగన్ పిలిచి ఉద్యోగమిస్తే ఎంత పని చేసాడు?

kamineni sruinivas gave hand to jagan

                  కొమ్మినేని శ్రీనివాసరావు…ఓ సీనియర్ జర్నలిస్ట్ గా తెలుగువారికి చిరపరిచితమైన ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈనాడులో సుదీర్ఘ కాలం,ఆపై ఆంధ్రజ్యోతి,ఎన్ టీవీ,ప్రస్తుతం సాక్షిలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.ఎన్ టీవీ లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు టీడీపీ నేతలని టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ముఖ్యులు భావించారు.దీంతో ఆ ఛానల్ మీద ఒత్తిడి తెచ్చి కొమ్మినేని ఉద్యోగానికి ఎసరు పెట్టారు.అదే టైం లో జగన్ తరపున ఆహ్వానం అందుకుని సాక్షిలో చేరిపోయారు కొమ్మినేని.ఇక అక్కడ కొమ్మినేని ఐడియాలజీ,సాక్షి ప్రాధాన్యం సూపర్ గా మ్యాచ్ అయిపోయాయి.అయితే కొమ్మినేని సాక్షిలో చేయడమే ఇప్పుడు జగన్ కొంప ముంచింది.ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టుకి వెళ్ళడానికి దారి తీసింది కొమ్మినేని ఇంటర్వ్యూ ల వల్లే..
         మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో సిబిఐ కి వ్యతిరేకంగా,జగన్ కి అనుకూలంగా మాట్లాడ్డం గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు.ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లే జగన్ బెయిల్ రద్దు అంశం కోర్టు ముందుకు చేరింది.కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఒక్క ఇంటర్వ్యూ లో మాత్రమే కాదు కొమ్మినేని తెలుగు రాష్ట్రాలకి చెందిన ఏ సీనియర్ రాజకీయ వేత్తని ఇంటర్వ్యూ చేసినా నేరుగా వై.ఎస్,జగన్ ని పొగిడించే ప్రయత్నం చేశారు.ఇక ఆయన ఇంటర్వ్యూలో జగన్ కేసుల విషయం ఎలా వున్నారు అని అడిగినంత కామన్ ప్రశ్న అయిపోయింది.ఆ క్రమంలోబాబుని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్లంతా జగన్ మీద కేసులు నిలబడబోవని కొమ్మినేని ఇంటర్వ్యూల్లో చెప్పారు.అలా చాలా ఇంటర్వ్యూల తర్వాత రమాకాంత రెడ్డి ఇంటర్వ్యూ ఇంకాస్త సెన్సేషన్ అయ్యింది.ఆయన ఒకప్పుడు సీఎస్ గా పని చేసిన వారు కావడం అందుకు ఇంకో కారణం.ఏదేమైనా జగన్ పిలిచి ఉద్యోగమిస్తే …పర్యవసానాలు పట్టించుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించి బాస్ కి ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు ksr . ప్రస్తుతం యూట్యూబ్ లో దర్శనమిస్తున్న ksr ఇంటర్వ్యూలు చూస్తే తప్పు ఎక్కడ జరిగిందో ఎవరికైనా తేలిగ్గా అర్ధమైపోతుంది.ఒకవేళ జగన్ నుంచి ఇలా అడగాలని,చేయాలని ksr కి ఆదేశాలు ఉంటే ఆయన సేఫ్..లేదంటే …జగన్ అండ్ కో ప్రశ్నలు ఎదుర్కోడానికి కొమ్మినేని సిద్ధం కావాల్సిందే.ఇప్పటికే సాక్షిలో కొందరు కొమ్మినేని ఎప్పుడు దొరుకుతాడా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట.
  

SHARE