‘బాహుబలి 2’ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు సాధ్యం కాని వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన విషయం తెల్సిందే. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి 2’ లాంగ్ రన్లో మరో 250 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు కూడా ‘బాహుబలి 2’పై మరియు చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ సమయంలో బాలీవుడ్ త్రి ఖాన్స్ మాత్రం ఇప్పటి వరకు బాహుబలి 2పై స్పందించినదే లేదు.
ఇప్పటి వరకు భారీ సినిమాలు అన్నా, భారీ కలెక్షన్స్ అన్నా కూడా ఆ ముగ్గురు ఖాన్స్ పేరు ఉండేది. కాని ‘బాహుబలి 2’ సాధించిన కలెక్షన్స్, రాబడుతున్న కలెక్షన్స్‌ను చూసి వారు షాక్ అవుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఒక అద్బుత సినిమాపై అంతా కూడా ప్రశంసలు కురిపించాలి, ఆ సినిమా ఏదైనా కూడా ప్రతి ఒక్కరు అభినందించాలి. కాని బాలీవుడ్ ఖాన్స్ త్రయం ఇంకా ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడటం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నాడు. అదే దంగల్ సినిమా సక్సెస్ అయిన సమయంలో దేశ వ్యాప్తంగా అంతా కూడా స్టార్స్ అభినందించారు. ముఖ్యంగా మనస్టార్స్ కూడా అమీర్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు. కాని మన సినిమాపై మాత్రం వారు మౌనం ఎందుకు అంటూ ప్రశ్నించాడు. కోన వెంకట్ వ్యాఖ్యలు టాలీవుడ్ సినీ జనాలు మరియు ప్రేక్షకులు అంతా కూడా సమర్థిస్తున్నారు.