కోనా… ఇది వార్నింగా… సజెషనా?

Posted February 10, 2017

kona venkat suggestion or warning to bobbyజనాతాగ్యారేజ్ వంటి సూపర్ సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.

అయితే జనతాగ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్…  ఎటువంటి సినిమాను చేయనున్నాడు, ఏ దర్శకుడితో పనిచేయనున్నాడోనని అటు సినీ వర్గాలతో పాటు ఇటు అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ క్రమంలో పలువురి డైరెక్టర్ ల పేర్లు వినిపించినా ఎన్టీఆర్ మాత్రం బాబి సినిమాకే సై అన్నాడు. కాగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా  ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో జనతాగ్యారేజ్ తో తన రేంజ్ పెంచుకున్న ఎన్టీఆర్ తన కొత్త  సినిమాను బాబి చేతిలో పెట్టడంతో అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాను బాబి ఎలా హ్యాండిల్ చేస్తాడోనని టెక్షన్ పడుతున్నారు. అయితే రైటర్ కోన వెంకట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి వార్నింగ్ లాంటి సలహాను ఇస్తూ బెస్ట్ విషస్ ని తెలిపాడు.

‘ఆల్ ద బెస్ట్ బాబీ. నీ చేతిలో ఎన్టీఆర్ అనే అరుదైన వజ్రం వచ్చి చేరింది. అలాంటి వజ్రాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. సరైన రీతిలో తారక్‌ను వాడుకుంటావని, ఓ మంచి చిత్రాన్ని అందిస్తావని నమ్ముతున్నాను’ అంటూ కోన ట్వీట్ చేశాడు. మరి బాబి… ఎన్టీఆర్ అనే నందమూరి  వజ్రానికి ఎలాంటి మెరుపులు అద్దనున్నాడో చూడాలి.  

SHARE