పవన్ కోసం.. కోన ప్రయత్నాలు !

Posted October 14, 2016

   kona venkat trying direction for pawan kalyan dasari movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు కోన వెంకట్. ఈ మధ్య ఆ దిశగా ప్రయత్నాలు కూడా వేగవంతం చేసినట్టు సమాచారమ్. 2019లోగా పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో.. ఈలోపే తన బలమైన కోరికని తీర్చుకోవాలని కోన
భావిస్తున్నారు.

ఈ క్రమంలో కోనకి దొరికిన అవకాశం దాసరి సినిమా. దాసరి బ్యానర్ లో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు దర్శకుడు ఎవరన్నది ఖరారు కాలేదు. బోయపాటి, కొరటాల.. తదితరుల పేర్లు తెరపైకి వచ్చినా.. ఫైనల్ మాత్రం కాలేదు. ఇప్పుడీ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని కొన తెగ ప్రయత్నిస్తున్నాడట. దాసరిని కలసిన కోనకి కథతో పవన్ ని ఒప్పిస్తే.. తనకేం అభ్యంతరం లేదని సెలవిచ్చారట. దీంతో.. పవన్ ని బలమైన కథతో పడేసే పనిలో పడ్డాడు కొన. పవన్ కోసం ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే కోన పవన్ ని కలసి కథని వినిపించనున్నాడు. మరి.. కోనకి పవన్ అవకాశం ఇస్తాడో ? లేదో.. ?? చూడాలి.

SHARE