ఆ చేపకోసం 20 నెంబర్ జీవో….

0
2967

korameenu fish telangana state government order 20

తెలంగాణాలో మత్స్యసంపదను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతరించిపోతున్న కొరమీను ను రాష్ట్ర చేపగా గుర్తించింది. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఈ బొమ్మెచేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొరమీను పెంపంకం కోసం నిధులు కూడా కేటాయించింది.రాష్ట్రంలో ఎక్కువగా దొరికే కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించాలని రెండు నెలలక్రితం మత్య్స శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బొమ్మె చేపను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేసింది. మత్స్య శాఖ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం కొరమీనును స్టేట్ ఫిష్ గా గుర్తిస్తూ జీవో నెంబర్ 20ను జారీ చేసింది.

కొరమీను జాతీ చేపను రక్షించేందుకు వాటి జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ లో భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొర్రమట్ట, కొర్రమీనుగా కూడా పిలుచుకునే బొమ్మె చేప నీటిలోనేకాకుండా భూమిపై మూడురోజుల వరకు బతికే అవకాశం ఉంటుంది. అందుకే మిగితా చేపలకంటే భిన్నంగా…ఈ చేపప్రాణం తో అందుబాటులో లభిస్తోంది. బొమ్మె చేపలో… తక్కువ కొవ్యు, ఎక్కువ ఔషధ విలువలు ఉంటాయి. గుండెపోటు, రక్తపోటు, షుగర్ ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.

Leave a Reply