మహేష్ సినిమా కొరటాల కన్ఫర్మ్ చేశాడు..!

koratala confirmed mahesh movie

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి నాన్ బాహుబలి రికార్డులన్నిటిని క్రాస్ చేసేసి మరోసారి మహేష్ స్టామినా ఏంటో అందరికి తెలిసేల చేసింది. ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ మరోసారి కొరటాల శివతో కలిసి పనిచేయబోతున్నాడు. అయితే మొన్నటిదాకా రూమర్ అనుకున్న ఈ న్యూస్ ఇప్పుడు స్వయంగా డైరక్టర్ కొరటాల శివనే కన్ఫర్మ్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా తీసిన కొరటాల శివ సినిమా రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తారక్ ను సరికొత్త పాత్రలో నేచర్ లవర్ గా చూపించిన కొరటాల శివ ట్రైలర్ తోనే సినిమా హిట్ టాక్ తెచ్చేలా చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాలే కాని కథాబలం ఉండట్లేదు అన్న కామెంట్లు వస్తున్న ఈరోజుల్లో కొరటాల శివ స్టార్స్ తో బలమైన కథ కథనాలతో పాటుగా సమాజానికి ఉపయోగపడేలా సినిమాలు తీయడం మెచ్చుకోదగ్గ విషయం. మరి రిపీట్ కాబోతున్న శ్రీమంతుడు కాంబో ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల దాకా ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్.

SHARE