ఆ కథ కొరటాలది కాదా..?

0
384
Koratala Siva Again Facing A Copy Story For Mahesh Movie

Posted [relativedate]

Koratala Siva Again Facing A Copy Story For Mahesh Movieమహేష్ తో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు తారక్ తో జనతా గ్యారేజ్ అంటూ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా చేసిన రచయిత దర్శకుడు కొరటాల శివ మళ్లీ మరోసారి మహేష్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ముహుర్తం కూడా పెట్టేసుకున్న ఈ సినిమా కథ విషయంలో మళ్లీ రచ్చ జరిగేలా ఉంది. కొరటాల శివ తానే రాసుకున్నాడంటున్న మహేష్ కథ తకిట తకిట డైరక్టర్ శ్రీహరి రాసుకుందట.

మహేష్ తో ఈ సినిమా తీయాలని కొరటాల శివకు కథ వినిపించగా కథ కొరటాల శివకు నచ్చేయడంతో అతని దగ్గర నుండి కోటి రూపాలిచ్చి కొన్నాడట. అయితే మూల కథ శ్రీహరిది అయినా కథ కొరటాల మార్క్ కమర్షియల్ టచ్ ఇస్తూ ఫైనల్ వర్షన్ రాసుకున్నాడట. మహేష్ కూడా కథ ఓకే చెప్పేయడంతో సినిమాకు రెడీ అయ్యాడు. శ్రీహరిని అన్యాయం చేసి కొరటాల శివ సినిమా చేస్తున్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

శ్రీమంతుడు విషయంలో కూడా కొరటాల శివ మీద ఇలాంటి కాపీ వివాదమే వచ్చి పడింది. అదెలాగో సర్ధుమనిగింది అనుకుంటే మళ్లీ ఇప్పుడు చేయబోయే మహేష్ సినిమాకు అదే తలనొప్పి స్టార్ట్ అయ్యింది. మరి ఈ విషయం త్వరగా పరిష్కరించుకుంటే మంచింది లేదంటే సినిమా తీశాక కష్టాలు పడాల్సి వస్తుంది.

Leave a Reply