మహేష్ కి కొరటాల కథ కొనుక్కొచ్చాడా?

Posted April 5, 2017

koratala siva buying story for mahesh movie from director srihari
కొరటాల శివ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరు.అంత కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓ రచయితగా సక్సెస్ అయ్యాకే మెగా ఫోన్ చేపట్టిన చరిత్ర కొరటాలది. దానికి తగ్గట్టే ఆయన దర్శకత్వానికి ఎంత మంచి పేరు వచ్చిందో ..ఆ సినిమాల్లో రచయితగాను అంతే పేరు దక్కింది.అలాంటి కొరటాల శ్రీమంతుడు తర్వాత మహేష్ హీరోగా చేస్తున్న ‘భరత్ అను నేను’ సినిమాకి సొంతంగా కథ రాయలేదంట.ఓ చోటా దర్శకుడి దగ్గర కథ కొన్నాడని తెలుస్తోంది. అయితే చోటా దర్శకుడికి ఇచ్చిన ఆఫర్ మాత్రం భారీగానే వుంది. దాదాపు కోటి రూపాయలు చెల్లించి మహేష్ సినిమా కోసం కథ కొన్నట్టు టాక్.కొరటాల లాంటి రైటర్ కం డైరెక్టర్ ఇంత ఖర్చు పెట్టి ఓ కథ కొన్నాడంటే అందులో ఎంత స్పెషలిటీ ఉందో..ఇంతకీ ఆ కథ రాసిన వాళ్ళు ఎవరో తెలుసా?

అప్పట్లో సత్యభామ,తకిటతకిత సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన శ్రీహరి నాను సక్సెస్ మాత్రం కొట్టలేకపోయాడు.ఆ రెండు సినిమాల్లో మంచి పాయింట్స్ తీసుకున్నా వాటిని తెరకెక్కించడంలో తడపడ్డాడు.అయితే మంచి ప్రయత్నం చేసినట్టు పేరొచ్చింది.కానీ హిట్ రాలేదు. అప్పటి నుంచి నిర్మాతల్ని ఒప్పించడానికి ఓ మంచి కథ రాసుకుని ఎన్నో చోట్లకి తిరిగినా ఛాన్స్ రాలేదట. టాలెంట్ కన్నా సక్సెస్ కి విలువిచ్చే సినీ రంగంలో ఆ అనుభవాలు సహజమే.అయితే ఎన్నడూ లేని విధంగా ఆ కథ విన్న కొరటాల కోటి రూపాయల భారీ ఆఫర్ తో దాన్ని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది.

SHARE