బోయపాటి వాడుకుని వదిలేసే రకమా?

 koratala siva said open heart with rk program shocking comments boyapati srinu
ఓపెన్ హార్ట్ విత్ rk లో సింహా సినిమా గురించి డైరెక్టర్ కొరటాల శివ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది.నేరుగా చెప్పకపోయినా సింహా స్టోరీ ,మాటలు తానే రాసినా …ఆ క్రెడిట్ దక్కలేదని శివ చెప్పడం బోయపాటికి పంటి కింద రాయిలా తగిలింది .ఓ వైపు చిరు 151 వ సినిమా అవకాశం రావచ్చన్న సంకేతాలు వస్తున్నతరుణంలో శివ వ్యాఖ్యలు బోయపాటికి షాక్ ఇచ్చాయి .దీనిపై కౌంటర్ ఇవ్వడానికి అయన తగిన అవకాశం కోసం చూస్తున్నాడని తెలుస్తోంది .మరో వైపు చిత్ర రంగంలో ఘోస్ట్ రైటర్స్ గురించి అందరికీ తెలిసినా గతం తో పోలిస్తే కథాచౌర్యం తగ్గిందని అందరూ భావిస్తున్నారు .అలాంటి టైములో బోయపాటి కూడా వాడుకుని వదిలేశాడంటూ ఓ టాప్ డైరెక్టర్ మీడియా ముందే నోరు విప్పడం సంచలనం రేపింది.

బోయపాటి వ్యవహార శైలిపై విమర్శలు రావడం ఇది మొదటిసారేమీ కాదు .గతంలో లెజెండ్ పాటల విషయంలో బోయపాటి ,దేవి మధ్య మాటల యుద్ధం జరిగింది .దేవితోదగ్గరుండి ..పిండి పని చేయించుకున్నానని బోయపాటి చెప్పిన మాటలపై దేవి మండిపడ్డాడు .ఒకరితో అలా చెప్పించుకునే స్థితిలో లేనని కుండ బద్దలు కొట్టాడు .పక్కనోడి పనిలోకూడా క్రెడిట్ కొట్టాలనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని అప్పట్లో బోయపాటి గురించి అనుకున్నారు .ఇప్పుడు శివ కామెంట్స్ తో బోయపాటి వాడుకుని వదిలేస్తాడన్న బ్రాండ్ పడింది .దీనికి బోయపాటి సమాధానమేమిటో?నిజానిజాలేమిటో తెలియాల్సి వుంది .

SHARE