జగన్ ని ఒప్పుకోలేకపోతున్న కోట్ల కుటుంబం?

0
852
kotla vijaya bhaskar reddy son surya prakash reddy said congress party become main opposition party in 2019 elections

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kotla vijaya bhaskar reddy son surya prakash reddy said congress party become main opposition party in 2019 elections
ఎవరెన్ని చెప్పుకున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీ లో ప్రధాన ప్రత్యర్ధులు టీడీపీ ,వైసీపీ మాత్రమే.రాజకీయాల్లో తలపండిన వాళ్ళే ఈ విషయం చెప్పక్కర్లేదు.ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ విషయం చెప్పేస్తాడు.ఇక మూడో పార్టీ ఏదైనా ఉందనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన గురించి అనుకుంటాం.అయితే ఏపీ రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్లుగా తలపండిన ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు మాత్రం ఇందుకూరి ఒప్పుకోవడం లేదు.ఆయన ఇంకెవరో కాదు ..మాజీ ఎంపీ..మాజీ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడు సూర్య ప్రకాష్ రెడ్డి. ఇంతకీ ఆయన ఇప్పుడు ఏ పార్టీ లో వున్నాడో తెలుసా? కాంగ్రెస్ ..ఆ పార్టీ లో ఉండటంలో తప్పులేదు గానీ ఆ పార్టీ గురించి ఆయన చెప్తున్న మాటలు వింటే మాత్రం నవ్వొస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీ కి గట్టి పోటీ ఇవ్వలేదని కోట్ల అంటున్నారు .ఆ పాత్ర కాంగ్రెస్ పోషిస్తుందట.2019 లో ప్రధాన పోటీ టీడీపీ,కాంగ్రెస్ మధ్యే జరుగుతుందట. కోట్ల మాటలు వినగానే ఏళ్ల తరబడి ఆయన పక్కనే ఉంటున్న అనుచరులు కూడా పక్కకి వచ్చి నవ్వుకుంటున్నారు. ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ పనికిరాదని అంటున్నారు.కానీ అసలు విషయం అది కాదని కోట్ల కి తెలియదా ఏంటి ? అయితే ఒకే పార్టీ లో వున్నా సుదీర్ఘ కాలం రాజకీయ వైరం నడిచిన వై.ఎస్ కుటుంబం అంటే ఇష్టం లేకనే ,జగన్ ని నాయకుడిగా ఒప్పుకోలేకనే కోట్ల ఇలా కామెంట్ చేసి వుంటారు.సీమలో పగలు అంత తేలిగ్గా చల్లారుతాయా ?

Leave a Reply