100 కోట్లపై క్రిష్ కన్ను ..దసరాకి శాతకర్ణి టీజర్

Posted September 28, 2016

  krish balayya gouthami putra shatakarni movie teaser release dasara
మంచి దర్శకుడు అన్న పేరుతో పాటు కమర్షియల్ సక్సెస్ చూడాలని డైరెక్టర్ క్రిష్ కసిగా వున్నాడు.ఈసారి గౌతమీపుత్ర శాతకర్ణి అందుకు అనువైన ఆయుధం అని కూడా అయన భావిస్తున్నాడు.బాలయ్య 100 వ చిత్రంగా రాబోతున్న శాతకర్ణి కి మార్కెట్ లో క్రేజ్ తెప్పించేందుకు క్రిష్ ఓ ప్రత్యేకమైన ప్లాన్ తో ముందుకెళ్తున్నాడట.ఇండియన్ సినిమా ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటోందని …బయోపిక్ ,చారిత్రక చిత్రాలకి సైతం ఆదరణ లభిస్తోందని ఇటీవల ఓ సర్వే లోతేలింది.వివిధ సినిమాల కలెక్షన్స్ సైతం దాన్ని ప్రూవ్ చేశాయి.బాహుబలి లాంటి జానపదానికి రాజమౌళి బ్రాండ్ ఉందనుకున్నా …లేడీ ఓరియెంటెడ్ చారిత్రక చిత్రం రుద్రమదేవి సైతం డివైడ్ టాక్ మధ్య సేఫ్ ప్రాజెక్ట్ అయింది.

ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరో 100 వ సినిమా మంచి టాక్ వస్తే సులువుగా 100 కోట్లు కొల్లగొడుతుందని క్రిష్ అంచనా వేస్తున్నాడు.అయితే అది మాటల్లో చెప్పకుండా సినీ సర్కిల్స్ కూడా టీజర్ చూసి థ్రిల్ అయ్యేలా రూపొందించాడట.ఆ టీజర్ అస్త్రంగా మార్కెట్ చేయాలని క్రిష్ ఐడియా .ఇక సబ్జెక్టు,టేకింగ్ విషయంలోను ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు క్రిష్.ఇప్పటికే రెడీ అయిన ఆ టీజర్ దసరా రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE