క్రిష్ దర్శకత్వంలో “ఝాన్సీలక్ష్మీభాయ్”

Posted March 22, 2017

krish-is-going-to-direct-jhansi-lakshmi-bai-movie

బాలీవుడ్‌ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ ఫ్యాష‌న్‌ కి కేరాఫ్ అడ్ర‌స్.  ఎన్నో అద్బుత‌మైన పాత్ర‌ల్లో  న‌టించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఝాన్సీలక్ష్మీభాయ్ అనే ప్రాజెక్ట్ ని టేకప్ చేసిందన్న విషయం తెలిసిందే. ఆమె ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించడంతో పాటు,  ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా అందిస్తోంది. అంతేకాకుండా తానే తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను క్రిష్ పై ఉంచిందని తెలుస్తోంది.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో స‌త్తా ఉన్న డైరెక్ట‌ర్‌ గా ప్రూవ్ చేసుకున్నాడు క్రిష్. ప‌రిమిత బ‌డ్జెట్‌ తో టెక్నిక‌ల్‌ గా హై స్టాండర్డ్స్  ఉన్న సినిమా తీశాడ‌ని పేరు తెచ్చుకున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో అక్ష‌య్‌ తో ‘గ‌బ్బ‌ర్’ వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించడంతో కంగనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని క్రిష్ కి అప్పగించిందట. నిజానికి క్రిష్.. శాతకర్ణి సినిమా తర్వాత వెంకటేష్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే అది లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యింది. దీంతో  క్రిష్ కూడా కంగాన సినిమాకు ఓకే చెప్పేశాడట. ఈ సినిమా కూడా హిట్ అయితే క్రిష్ బాలీవుడ్ లో పాగా వేసినట్లే. మరి క్రిష్ ఏం చేస్తాడో…

SHARE