చోర..ఈ టైటిల్ ఎవరి కోసం క్రిష్?

0
245
Krish registered “Chora” title

Krish registered “Chora” title

సినిమాకి కధలు, హీరోలు ఫైనలైజ్ కాక ముందే టైటిల్స్ ని రిజస్టర్ చేయిస్తున్నారు ఇప్పటి దర్శకనిర్మాతలు. నిర్మాతల్లో దిల్ రాజు ఈ విషయంలో ముందుంటే దర్శకుల్లో మాత్రం క్రిష్ ముందుంటాడని చెప్పచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అతను నెక్ట్స్ చేయబోయే కధలను కూడా అదే రేంజ్ లో ఉండే విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

నిజానికి గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. దాంతో ముంబై వెళ్లి కొన్ని యాడ్స్ షూట్ చేసిన క్రిష్..  ప్రస్తుతం ఓ యంగ్ హీరో తో ఓ సినిమా చేయడానికి కథ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆ కథకి చోర అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. ఉగాది సందర్భంగా ఈ మూవీకి సంబందించిన వివరాలు తెలియనున్నాయి. కాగా వెంకీ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో క్రిష్ రానాతో ఈ చోర సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.

Leave a Reply