అదే బాటలో మరో రెండు సినిమాలు: క్రిష్

Posted February 13, 2017

krish says to direct sri krishnadevaraya and gautama buddha biopic moviesక్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన గాతమీపుత్ర శాతకర్ణి ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా అందించిన ఉత్సాహంతో క్రిష్ మరో రెండు సినిమాలను తెరకెక్కిస్తానని ప్రకటించాడు. మీడియాతో మాట్లాడిన ఆయన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. కేవ‌లం 79 రోజుల్లో తాము ఈ సినిమాను కంప్లీట్ చేశామని తెలిపాడు.

తాను భ‌విష్య‌త్తులో శ్రీకృష్ణదేవరాయలు,గౌతమ బుద్ధుడు లాంటి చారిత్రక క‌థ‌ల‌ను కూడా తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. తెలుగు చిత్రసీమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని, అప్పుడే  రాబోయే తరాలకు మనం చరిత్రను తెలియజెప్పిన వారమౌతామని వెల్లడించాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న సినీ విశ్లేషకులు చారిత్రక సినిమాలు రూపొందించడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి బాలయ్య చేయడం వల్ల విజయం సాధించిందంటున్నారు. మరి క్రిష్ చేయబోయే ఈ రెండు సినిమాలు ఏ మాత్రం విజయం సాధిస్తాయో  చూడాలి.

SHARE