బెజవాడ లోశ్రీవారి నామం..చిన్న లడ్డు ..

 krishna pushkaralu ttd give laddu Devotees

కృష్ణా పుష్కరాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయ. పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు నాలుగు వరుసల క్యూ ద్వారా తితిదే సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తోంది.

టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తిభావంతో క్యూలైన్లను క్రమబద్దీకరిస్తున్నారు.ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు వీలుగా ఆలయ పరిసరాలను ప్రతి గంటకు ఒకసారి నీటితో తడుపుతున్నారు. టీటీడీ ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో ప్రతి రోజు 160 మంది మూడు షిఫ్ట్‌లలో శ్రీవారి ఆలయ పరిసరాలను శుభ్రపరుస్తున్నారు. భక్తులకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా టీటీడీ త్రాగునీరు అందిస్తోంది.

శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, చిన్నలడ్డూ (ఉచితంగా) అందిస్తున్నారు. అదేవిదంగా విజయవాడలోని స్వరాజ్ మైదానం, శ్రీకాకుళం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ ఆంధ్ర విష్ణు ఆలయం, అమరావతిలోని బౌధ్ధ స్ధూపం ప్రాంగణములో తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం వద్ద హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగీత, సాంస్క­ృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలో భక్తులు విరివిగా పాల్గొంటున్నారు.

SHARE