కృష్ణాజలాలు ..అభ్యంతరాలు

0
498

 krishna river water war ap telangana karnatakaకృష్ణానదీ జలాల పంపకాలపై ఎగువ రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్ర కొర్రీలు ఇంకా కొనసాగుతున్నాయి.  ట్రిబ్యునల్ ముందు జరిగిన వాదనల్లో రాష్ట్రాలు తమతమ వాదనలు వినిపించాయి.ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. నదీ జలాల కేటాయింపులు మొదట్నుంచి జరగాలని కోరింది తెలంగాణ. ఇందుకోసం విభజన చట్టం సెక్షన్ 89 చేర్చారని.. దీనికి విస్తృత అధికారాలు ఉన్నాయని కోర్టుకు నివేదించింది.

అలాగే తెలుగురాష్ట్రాలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నా.. ఎగువ రాష్ట్రాలు పట్టించుకోని విషయాన్ని కోర్టుకు వివరించింది.అయితే మన రాష్ట్ర వాదనపై రెస్పాండైన కర్నాటక.. కృష్ణానదీ జలాల వివాదంలో తెలంగాణ వాదిస్తున్నట్లుగా, చట్టంలోని సెక్షన్ 89కి విస్తృత అధికారాలు లేవని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ చేస్తున్న ఫిర్యాదును మరో ట్రైబ్యునల్  ముందుకు తీసుకెళ్లాలని వాదించింది. అలాగే 2014లో విభజన చట్టం వచ్చిన తర్వాతే తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదన మొదలైందని ఆరోపించింది. సెక్షన్  89కి  చాలా తక్కువ పరిధి ఉందని, విస్తృత అధికారాలు లేవని, ఆర్టిక్  262కి దీనికి అసలు సంబంధం లేదని వాదించింది.

అయితే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర విభజనను ఇతర రాష్ట్రాల విభజన చట్టాలతో పోల్చవద్దని తెలంగాణ తరఫున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. సెక్షన్ 89 న్యాయబద్దంగా పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేర్చారని, సెక్షన్  89 రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. నీటి హక్కుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్ కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే పునర్ వ్యవస్థీకరణ చట్టం చేసేటప్పుడు సెక్షన్  84 నంచి 90 వరకు రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసిందనీ గుర్తు చేశారు. ఇందుకోసమే సెక్షన్  89కు ఎలాంటి పరిమితులు లేకుండా చేశారన్నారు.

గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాటి మధ్య జలవివాదాలు లేవనీ, అందుకే ఇలాంటి సెక్షన్లు ఆ చట్టాల్లో కనిపించవని వాదించారు.నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరిగిందని.. తెలంగాణ నీటి హక్కులకోసం డిమాండ్  చేయడం సమంజసమేనని వ్యాఖ్యానిచింది  ట్రిబ్యునల్. ఇక మరింత బలంగా వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న తెలంగాణ విజ్ఞప్తికి బ్రిజేష్ కుమార్ అంగీకరించారు. తరువాత విచారణను సెప్టెంబరు 7,8 తేదీల్లో చేపడతామని తెలిపారు.

Leave a Reply