Posted [relativedate]
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్-రెజీనా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నక్షత్రం’. ఇదో పోలీస్ థ్రిల్లర్. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథ. దసరా కానుకగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా రిలీజైన ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ వస్తోంది. వంశీ మరోసారి మాయ చేయడం ఖామంటున్నారు.
‘నక్షత్రం’లో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ గెస్ట్ రోల్ కనిపించనున్నాడు. తేజుకి జంటగా ప్రగ్యజైస్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం మరో విశేషాన్ని కూడా ప్లాన్ చేశాడు వంశీ. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాంచరణ్ చేతుల మీదుగా.. నక్షత్రం సినిమా తొలి పది ప్రచార చిత్రాలను ప్రణాళికబద్ధంగా రిలీజ్ చేయించనున్నారు.
ఈ విషయం కాసేపు ప్రక్కన పెడితే.. ‘నక్షత్రం’ పోలీస్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. కానీ.. నక్షత్రంలో అసలు ఏముండబోతుందన్నది ఇంతవరకు రిలీవ్ చేయలేదు. మరి.. నక్షత్రంలో దాగున్న సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మరికొన్నాళ్ల పాటు ఆగాల్సిందే.