Posted [relativedate]
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసేవారు. అయితే గతకొంతకాలంగా సీన్ మారింది. మహాత్మ సినిమా నుండి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. తాజాగా నక్షత్రం సినిమాతో తన లక్ ని మరోసారి పరీక్షించుకోనున్న ఈ దర్శకుడికి చుక్కలు కనిపిస్తున్నాయట.
సందీప్ కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హీరో తనీష్ విలన్ రోల్ పోషిస్తున్నఈ సినిమా ప్రారంభం అయ్యి దాదాపు సంవత్సరం కావొస్తోంది. అవాంతరాల మధ్య నడుస్తున్న ఈ సినిమా షూటింగ్ కి తాజాగా మరో కొత్త సమస్య వచ్చి పడిందట. ఈ మూవీని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు లేకపోవడం తో షూటింగ్ కు బ్రేక్ వచ్చిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. దీంతో సినిమా అనుకున్న టైం కు రిలీజ్ కాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కవయ్యిందని భావిస్తున్న ప్రొడ్యూసర్స్ సినిమా ఇంకాస్త లేటు అయితే ఇంకా బడ్జెట్ ఎక్కువతుందని వాపోతున్నారట. మరి కృష్ణ వంశీ ఈ గండం నుండి బయటపడి తన ఉనికిని ఎలా చాటుకుంటాడో చూడాలి.