Posted [relativedate]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రైతు అనే పేరుతో బలమైన కథను రెడీ చేశారు. ఈ కథాంశం బలంగా ఉండడంతో ఒక దశలో బాలయ్య వందోచిత్రం ఇదేనని ప్రచారం జరిగింది. కానీ క్రిష్ వినిపించిన శాతకర్ణి తెగ నచ్చేయడంతో బాలకృష్ణ అటు వైపు మొగ్గుచూపారు. శాతకర్ణి రిలీజ్ అయిపోవడంతో ఇప్పుడు బాలయ్య 101వ చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో ఆయన రైతు సినిమా చేయబోతున్నారు.
రైతు సినిమాలో హీరోకు దీటుగా ఒక పాత్ర ఉంటుందట. ఆ పాత్రకోసం అమితాబ్ ను అనుకున్నారు. ఈ మధ్య బాలయ్య బాబు కూడా ఈ విషయం చెప్పారు. కృష్ణవంశీ అయితే అమితాబ్ అయితేనే సినిమా చేద్దామని కూడా చెప్పారట. లేకపోతే సినిమాను వదిలేద్దాం అన్నంత రేంజ్ లో మాట్లాడారట. చివరకు రైతు పాత్రం కోసం బిగ్-బిని సంప్రదిస్తే… దీనిపై ఆయన ఆలోచిద్దాం అని చెప్పారట. అంతేకాదు దీనికి మరింత సమయం పట్టేలా ఉందట. దీంతో బిగ్-బి క్యారెక్టర్ ను కృష్ణంరాజుతో రీప్లేస్ చేయాలని కృష్ణవంశీ ఆలోచిస్తున్నారట.
బిగ్ బి అమితాబ్ కు తెలుగు లాంగ్వేజ్ రాదు. అంతేకాకుండా ఆయనకు ఇచ్చే పారితోషికం కూడా ఎక్కువే. దీనికి తోడు కాల్షీట్ల సమస్య. ఇవన్నీ చూస్తే కృష్ణంరాజు అన్ని విధాల ఆ క్యారెక్టర్ కు అర్హుడని కృష్ణవంశీ డిసైడ్ అయ్యారట. సినిమా స్క్రిప్ట్ వర్క్ … కాస్టింగ్ మొత్తం పూర్తయ్యిందని టాక్. ఇక షూటింగ్ మొదలుకావడమే మిగిలిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి కృష్ణంరాజు అమితాబ్ ను మరిపిస్తారా.. ? తన పాత్రకు న్యాయం చేస్తారా? అన్నది చూడాలి.