క్షణం హీరో గూడాచారి అయ్యాడు

Posted November 5, 2016

avs1516అంతకుముందు హీరోగా, విలన్ గా, డైరక్టర్ గా కూడా విశ్వ ప్రయత్నాలు చేసిన అడివి శేష్ క్షణం సినిమాతో లైం లైట్ లోకి వచ్చాడు. ఆ సినిమా హిట్ తో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న ఈ యువ హీరో ఇప్పుడు ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా ‘గూడాచారి’. అంటే మన సినిమాల్లో చూపిస్తున్నట్టు సీబీఐ.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) లాంటివేవి కాకుండా కొత్తగా సీక్రెట్ ఏజెంట్ గా ఉంటూ ఓ టెర్రరిస్ట్ ను పట్టుకునే రోల్ చేస్తున్నాడట.

హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో శేష్ కొత్త ప్రయత్నానికి నాంధి పలికాడు. రెగ్యులర్ గా సినిమాల్లో చూపించే ఇంటర్ పోల్ పోలీస్ అలాంటివేవి కాకుండా కొత్తగా ఉంటాడట ఈ గూడాచారి. మరి అడివి శేష్ ఈ గూడాచారిగా ఎలా అలరిస్తాడో చూడాలి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న శేష్ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఈ గూడాచారి సినిమా హిట్ అయితే మనోడికి కాస్త కూస్తో క్రేజ్ వచ్చేసినట్టే.

SHARE