అన్నాచెల్లెళ్ల షో ఎందుకో..?

Posted April 6, 2017

ktr and kavitha attend together in armoor public meetingఎప్పుడూ కేసీఆర్ తో వేదికలు పంచుకునే కేటీఆర్, కవిత.. ఇప్పుడు మాత్రం కలిసికట్టుగా ఒకే వేదికపై కనిపించబోతున్నారు. కేసీఆర్ సభల్ని మినహాయిస్తే.. వీరిద్దరూ కలిసి సభ పెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. కేటీఆర్, కవిత మధ్య తెరవెనుక విభేదాలు కూడా ఉన్నాయనేది టీఆర్ఎస్ వర్గాల మాట. గులాబీ పార్టీకి కీలకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కవిత, కేటీఆర్ కలిసి ప్రచారం చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఆర్మూర్ లో బహిరంగ సభకు కలిసి హాజరవ్వడం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది.

కేసీఆర్ అంతర్గత సర్వేల్లో పార్టీ బలహీనంగా ఉందని తెలిసి.. కేటీఆర్ సభల పేరుతో ఇప్పట్నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను దట్టించి.. జనంలో భావోద్వేగాల్ని రెచ్చగొడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కవిత, కేటీఆర్ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలకు తావులేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది ఇన్ సైడ్ టాక్. పైకి కేటీఆర్ ను కవితే ఆహ్వానించినా.. వీరిద్దరి సభ వెనుక కేసీఆర్ స్కెచ్ ఉందనేది రాజకీయ విశ్లేకుల మాట.

పార్టీలో యాక్టివ్ గా ఉండే హరీష్ ను తొక్కిపడుతున్న కేసీఆర్.. రేపో, మాపో ఆయన పోటీకి వస్తే.. కేటీఆర్ కు కవిత ఫుల్ సపోర్ట్ గా ఉండాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఢిల్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామనుకున్న కవిత ప్రతిపాదనకు కేటీఆరే అడ్డుపడ్డారు. ఇకపై అలాంటి అపోహలు, అపార్థాలు లేకుండా అన్నాచెల్లెళ్లు కలిసిపనిచేయాలని, లేకపోతే భంగపాటు తప్పదని కేసీఆర్ గట్టిగా హెచ్చరించారనే మాట వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఇంత సడెన్ గా కేటీఆర్, కవిత కలిసి సభ పెడుతున్నారు. హరీష్ భయంతో పెడుతున్న ఈ సభతో ఏం ఒరుగుతుందో 2019 ఎన్నికలే చెబుతాయి.

SHARE