కేటీఆర్ ఆలస్యానికి కారణం ఇదేనా..?

0
261
ktr coming to warangal meeting late because of traffic

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ktr coming to warangal meeting late because of trafficఅధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత టీఆర్ఎస్ నిర్వహించిన పోరుగల్లు సభ విజయవంతమైంది. కేసీఆర్ విజయవంతంగా ప్రగతి నివేదన చేశారు. కానీ కుమారుడు కేటీఆర్ మాత్రం అనుకున్నంతగా హైలైట్ కాలేదని ఆయన తెగ బాథపడుతున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణలో ఎక్కడ చూసినా కేటీఆరే కనిపిస్తున్నారు. ముఖ్య కార్యక్రమాల్లో కూడా తనయుడ్ని ముందుపెట్టి తాను సైడైపోతున్నారు కేసీఆర్. అలాంటిది వరంగల్ సభలో మాత్రం అలా కుదర్లేదు. యాదృచ్ఛికమే అయినా ఇది కార్యకర్తల్లో చర్చకు తావిచ్చింది. అసలు సభ మొదలైన చాలా సేపటివరకు కేటీఆర్ కనిపించలేదు.

దీంతో ఆయనకు ఏమైందో నని అందరూ ఆందోళన చెందారు. కానీ ట్రాఫిక్ సమస్యలో చిక్కుకున్నారని తెలిసింది. చివరకు కేసీఆర్ ప్రసంగానికి కాసేపటి ముందు కేటీఆర్ సభా వేదికపైకి చేరుకున్నారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ లో నేతలంతా ఎప్పుడో వరంగల్ చేరుకున్నారు. కేసీఆర్ కూడా టైమ్ ప్రకారమే సభకు వచ్చారు. కానీ కేటీఆర్ రాలేనంత బిజీనా అనే చర్చ మొదలైంది. సీఎంకు లేని ట్రాఫిక్ జామ్ మంత్రికి ఎందుకు ఉంటుందని సందేహాలు లేవనెత్తారు మరికొందరు. మొత్తం మీద కేటీఆర్ రాకతో అంతా సుఖాంతమైనా.. కొత్త అనుమానాలు మాత్రం క్యాడర్ కు వచ్చాయి.

అసలు వరంగల్ సభకు మొదట్నుంచీ కేటీఆర్ దూరంగానే ఉన్నారు. ప్లీనరీ దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన.. వరంగల్ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. ఇక్కడంతా కేటీఆరే చూసుకున్నారు. అందుకే కేటీఆర్ సభపై ఆసక్తి చూపలేదని, చివరి నిమిషంలో కేసీఆర్ ఒత్తిడితో వచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో హరీష్ కేసీఆర్ తో మొర పెట్టుకోవడంతో.. వరంగల్ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై కేటీఆర్ అంత సంతృప్తిగా లేరన్న విషయం లేట్ గా రావడంతోనే స్పష్టమైందని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో సభ సాక్షిగా కేటీఆర్, హరీష్ వర్గపోరు మరోసారి అందరి నోళ్లలో నానుతోంది.

Leave a Reply