కేటీఆర్ కి లైన్ క్లియర్ …హరీష్ సైడ్ అయ్యాడా ?

209
Spread the love

ktr harish kcr telangana

    తెలంగాణ లో వారసుడెవరో తేలిపోయింది .కేసీఆర్ తరువాత పగ్గాలు ఎవరికి వస్తాయో తెలిసినా …ఎక్కడో చిన్న సందేహం .ఇంకో అవకాశం ఉందేమోనని ? అయితే ఆ ఊహాగానాలకు కూడా తెర పడినట్టే కనిపిస్తోంది .కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగినతీరు ,గులాబీ దండు ఉత్సాహం చూసాక ఆ డౌట్ లన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి .యువరాజుకు పట్టాభిషేకం ఖాయమని స్పష్టమైంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందన్నదే ఇక తెలియాలి .

    ఇంత జరుగుతుంటే హరీష్ మౌనంగా ఉన్నారా? వున్నారు …అదేంటని అడిగాడట ఓ మిత్రుడు …ఇప్పుడు దాకా దక్కింది చాలా ఎక్కువ …ఇదంతా  కేసీఆర్ చలవే ..అయన మనసుకి నచ్చినట్టే ఉంటా…ఎవరో చెప్పినదాకా ఎందుకు ? కేటీఆర్ గద్దె ఎక్కేసమయం వస్తే నేనే ముందుండి ఆయన పేరు ప్రతిపాదిస్తానని కూడా ఆ మిత్రుడితో హరీష్ చెప్పాడంట .పైగా రోజూ చంద్రబాబుని మామ కి వెన్నుపోటు పొడిచాడని తిట్టే నేను కూడా అలాంటి విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలని ఎదురు ప్రశ్నించారట హరీష్..మొత్తానికి  పరిస్థితుల్ని అర్ధం చేసుకుని …అనువు గాని చోట అధికులమనరాదు …అన్న విషయాన్ని గుర్తెరిగి భవిష్యత్ వ్యూహ రచన చేసుకుంటున్న హరీష్ ని అభినందించాల్సిందే …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here