మెగా హీరో రాం చరణ్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ అతిధిగా వచ్చిన సగతి తెలిసిందే. మెగా అభిమానుల ఉత్సాహంతో జరిగిన ఈ ఈవెంట్ లో కె.టి.ఆర్ స్పీచ్ కూడా అందరిని ఆకట్టుకుంది. చరణ్ సూపర్ టాలెంట్ హీరో.. ఈ సినిమా విజువల్స్ లో చరణ్ చాలా బాగున్నాడు. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక చరణ్ సినిమాలన్ని చూస్తానన్న కె.టి.ఆర్ చరణ్ లక్కీ నెంబర్ 9, కార్ నెంబర్ 9, ఈ సినిమా కూడా తొమ్మిదవదే సో ఆ సెంటిమెంట్ తో సినిమా హిట్ అవుతుందని అన్నారు.
అంతేకాదు సినిమాలో చరణ్ ను చూశాక తాను కూడా ఫిట్ అవ్వాలని అనుకుంటున్నా అయితే చరణ్ లా సిక్స్ ప్యాక్ కష్టమే కాబట్టి కేవలం టూ ప్యాక్స్ లు చాలని చమత్కరించారు కె.టి.ఆర్. అంతకుముందు మాట్లాడిన ఆంధ్రా మంత్రి గంటా శ్రీనివాస రావు ధ్రువ హండ్రెస్ డేస్ ఫంక్షన్ వైజాగ్ లో జరుపుకుందాం అనగా దానికి కె.టి.ఆర్ కూడా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ వైజాగ్ లో జరిపితే అక్కడకు తాను కూడా వస్తానని చెప్పడంతో ఆడిటోరియం అంతా ఈలలు గోలలతో దద్దరిల్లింది.