పెళ్లిచూపులయ్యాక ఆ మంత్రేమన్నారు?

 ktr speech after watching pelli chupulu movie
నేటి తరం ఆలోచనలు,ఆచరణల్ని కాచి వడపోసిన చిత్రం పెళ్లిచూపులు .అందుకే ఈ చిన్న సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తోంది.ఈ చిత్రం సినీ రంగ ప్రముఖులనే కాదు రాజకీయనాయకుల్ని కూడా ఆకట్టుకుంటోంది.నిత్యం పాలనా వ్యవహారాల్లో బిజీగా వుండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా పెళ్లిచూపులు చూశారు.చిత్ర యూనిట్ మీద ప్రశంసల జల్లు కురిపించారు.

కొత్తతరం దర్శకులు సరికొత్త ఆలోచనలతో తీస్తున్న చిత్రాలు బాగుంటున్నాయని కేటీఆర్ అన్నారు.ఆ కోవలో పెళ్లిచూపులు ముందుంటుందని ఆయన చెప్పారు.ఈ తరహా సినిమాల్ని భారీనిర్మాతలు,నిర్మాణ రంగ సంస్థలు ప్రోత్సహించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఎవరెన్ని చేసినా సినిమా విజయం సాధించడం ముఖ్యమని …ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల అభిరుచిని ఆయన ప్రశంసించారు.

SHARE