అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ ..

 ktr speech international stage
యువతకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై శ్రీలంకలో ప్రసగించనున్నారు మంత్రి కేటీఆర్. మానవ వనరుల అభివృద్ధి విధాన రూపకల్పనలో భాగాంగా నిర్వహిస్తున్న… ఫస్ట్ హ్యుమన్ క్యాపిటల్ సమ్మిట్ లో పాల్గొనాలని ఇన్విటేషన్ పంపింది శ్రీలంక. విక్రమాసింఘే ప్రభుత్వ ఆహ్వానంతో మంత్రి కేటీఆర్ శ్రీలంక వెళ్లనున్నారు.

మానవ వనరుల అభివృద్ధి విధాన రూపకల్పనలో శ్రీలంక ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 11, 12వ తేదీల్లో కొలంబోలో జరిగే ప్రారంభ సమావేశంలో మంత్రి పాల్గొనాలని కోరింది శ్రీలంక. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు, ఇంటర్నెషనల్ లేబర్ అర్గనైజేషన్ సంస్ధల భాగసామ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. టూరిజం, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, ఫైనాన్సియల్, లాజిస్టిక్స్, నిర్మాణ, తయారీ రంగాల్లోని అవకాశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

2020 సంవత్సరంలోగా దాదాపు 10లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఈ సమావేశం ద్వారా జరుగుతుందని భావిస్తోంది శ్రీలంక ప్రభుత్వం.శ్రీలంక ప్రధాని విక్రమాసింఘేతో పాటు మంత్రి కేటీఆర్ ఈ సమ్మిట్ లో కీలక ఉపన్యాసం చేస్తారు. బిల్డింగ్ ఏ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్, ఇండియన్ ఎక్స్ పీరియన్స్ అనే అంశంపై మాట్లాడతారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టాస్క్ ద్వారా యువతకు ఇస్తున్న ట్రైనింగ్, టీ హబ్ తో పరిశోధనలకు ఇస్తున్న సహకారం మొదలైన అంశాలను కేటీఆర్ వివరిస్తారు.

SHARE