జగన్ కి కుమారస్వామి దారి చూపాడు

0
352
kumarasamy led the way to jagan about on it rides

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kumarasamy led the way to jagan about on it rides
లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ కి కర్ణాటక మాజీ సీఎం,jds నేత కుమారస్వామి ఓ దారి చూపాడు.జగన్ మీద కేసులు నడుస్తున్నాయి కానీ కుమారస్వామి మీద అవినీతి కేసులు నడవడం లేదు.అయితే ఇటీవల ఐటీ శాఖకి కుమారస్వామి ఆస్తుల మీద ఓ ఫిర్యాదు అందింది.కుమారస్వామి కుటుంబానికి దాదాపు 20 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.రియల్ ఎస్టేట్,సినిమా,ఇంకా ఇతర రంగాల్లో అక్రమ పెట్టుబడుల రూపంలో ఈ ఆస్తులు ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.వేంకటేశ గౌడ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసాడు.తొలుత అతను కాంగ్రెస్ కార్యకర్త అని భావించారు.అయితే కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ అతను మా కార్యకర్త కాదని ప్రకటించింది.

ఈ పరిణామాలపై కుమారస్వామి ప్రతిస్పందించారు. ఈ ఫిర్యాదు వెనుక సూత్రధారి బీజేపీ నేత యెడియూరప్ప అని కుమారస్వామి ఆరోపించారు.రాజకీయ అక్కసుతోటే ఇంకో ఏడాదిలో ఎన్నికలు వున్నాయనగా యెడ్యూరప్ప ఈ కుట్ర కి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.అంతటితో ఆగకుండా తమకు 300 …400 కోట్లు ఇస్తే మొత్తం ఆస్తులన్నీ అప్పగిస్తానని సవాల్ విసిరారు.తనపై వచ్చిన ఫిర్యాదు మీద సిబిఐ విచారణ జరిపి అందులో నిజముందని తేలితే ఆ ఆస్తులన్నీ రైతు రుణ మాఫీకి వాడుకోవచ్చని కూడా కుమారస్వామి సూచించారు.

కుమారస్వామి ఒక్కసారికే ఇంత దీటుగా తనపై ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. లక్ష కోట్ల అక్రమార్జన అని ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా,ఎన్నికేసులు నడుస్తున్నా అవి తప్పుడు కేసులని వాదించడం మినహా జగన్ ఇంత సూటిగా స్పందించింది లేదు.నిజంగా తప్పు చేయకుంటే జగన్ ఇదే స్థాయిలో సవాల్ విసిరితే బాగుంటుందని టీడీపీ నేత కాదు ఓ వైసీపీ నేతే వ్యాఖ్యానించారు. ఏదేమైనా జగన్ కి కుమారస్వామి ఓ దారి చూపారు.ఆ దారిలో జగన్ నడుస్తారో ..లేదో?

Leave a Reply