వామ్మో ఇదా టాక్స్ ఎమ్మెల్యే రియాక్షన్?

Posted September 27, 2016

 kurugondla ramakrishna venkatagiri mla tax
కురుగొండ్ల రామకృష్ణ .. నెల్లూరు జిల్లా ,వెంకటగిరి ఎమ్మెల్యే.అధికార పార్టీ కి చెందిన ఈయనగారికి స్థానికంగా పనిచేసే కాంట్రాక్టర్స్ ఎవరైనా ప్రత్యేక పన్ను కట్టాల్సిందేనట.దానికి లంచం,అమ్యామ్యా ఇలా ఏ పేరు పెట్టుకున్న అయన ఏమీ అనుకోరుగానీ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే సదరు కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తారు. రామకృష్ణ మీద ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి.అయినా అయన లెక్క చేయలేదు.విషయం బాబు గారి దగ్గరకు వెళ్లినా కేర్ చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం అయన గట్టిగానే ఇరుక్కున్నారు.

కృష్ణపట్నం రైల్వే లైన్ కాంట్రాక్టు పనులు చేస్తున్న మాంటోకార్లో సంస్థ అయ్యగారు 5 కోట్లు డిమాండ్ చేసేసరికి కళ్ళు తేలేసింది.ఇవ్వలేమని చెప్పడంతో పనులకి ఇబ్బంది కలిగించారట ఎమ్మెల్యే గారు.దీంతో విసిగిపోయిన ఆ సంస్థ ఒకేసారి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి ఫిర్యాదు చేసింది.దీంతో రామకృష్ణ ఇరుకున పడ్డారు. మీడియాలోకి విషయం వచ్చేసరికి అయన డిఫెన్స్ లోకి వెళ్తారని అందరు భావించారు.కానీ అయన ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్న విషయాలు తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 

‘మా జిల్లా మంత్రి వందలకోట్లు దోచుకుంటున్నా ఎవరూ అయన జోలికెళ్లరు.అన్నికాంట్రాక్ట్స్ లో కమిషన్ వసూలు చేస్తున్న షాడో ల గురించి ఎవరూ మాట్లాడరు. పార్టీలోని వ్యతిరేక వర్గమే నన్ను టార్గెట్ చేస్తోంది’….ఇలా mla మాట్లాడుతున్న విషయం తగలాల్సిన వాళ్ళకి తగిలింది.దీంతో వాళ్ళు విషయాన్ని సీఎం కి చేరవేశారంట.చంద్రబాబు కూడా ఆయనపై చర్య తీసుకోడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.ఆశ అత్యాశగా మారితే ఇలాంటి పరిస్థితి ఎదురవక తప్పదు.

[wpdevart_youtube]3w4rk6yBdZs[/wpdevart_youtube]

SHARE