కాంగ్రెస్ కురువృద్ధులకి కేవీపీ ముప్పు..

 Posted October 24, 2016

kvp appointed idea man in uttar pradesh elections
రాజకీయాల్లో గెలుపు మాత్రమే కాదు ఒక్కో సారి ఓటమి కూడా అద్భుత అవకాశాలు సృష్టిస్తుంది.అందుకు ప్రబల సాక్ష్యమే కాంగ్రెస్ హైకమాండ్ చుట్టూ ఉన్న కురువృద్ధులు . 2014 ఓటమి తర్వాత ఈ కాంగ్రెస్ కురువృద్ధుల ప్రభ కాస్త తగ్గిందేమోగానీ అంతకముందు 10 జన్ పద్ అనగానే వినిపించే పేరు సోనియా… కనిపించే దృశ్యాలు ఈ పెద్దలివే.అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ,అహ్మద్ పటేల్,చిదంబరం,గులాం నబి ఆజాద్,కమల్ నాధ్,దిగ్విజయ్ సింగ్,జై రామ్ రమేష్,అంబికా సోనీ,ఆంటోనీ….ఈజాబితాలో నేతలే 10 జన్ పద్ నుంచి బయటికి వస్తూ కనిపించేవాళ్ళు..పార్టీ వాణి వినిపించేవాళ్ళు.ఇప్పుడు ఏపీ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు కూడా ఆ జాబితాలో స్థానం సంపాదించారు.వీరిలో ఒక్క ఆంటోనీ మినహాయించి ఒక్కరికి కూడా సొంత రాష్ట్రంలో బలం లేదు.ఆయనది కూడా రాజకీయ బలం కాదు .వ్యక్తిత్వ సంపద .ఆయన్ని పక్కనబెడితే మిగిలిన వాళ్ళు సొంత రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయలేరు కానీ 10 జన్ పద్ కేంద్రంగా చక్రం తిప్పగలరు.ఆ అండతో ప్రజాక్షేత్రంలో ఎంత బలమున్న నాయకుడినైనా ముప్పుతిప్పలు పెట్టగలరు.దేశ రాజకీయాల్ని తమకి అనువుగా మార్చుకోగలరు. అధిష్టానానికి,క్షేత్ర స్థాయికి మధ్య వారధిగా నిలవాల్సిందిపోయి అడ్డుగోడలు కట్టేశారు.ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే..ఇప్పుడు ఆ కురువృద్ధులకి ఇస్తున్న గౌరవం కేవీపీ కి దక్కినట్టే కనిపిస్తోంది.

యూపీ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ అక్కడికి ఎన్నికల వ్యూహకర్తగా కేవీపీని పంపింది.పైన చెప్పిన కురువృద్ధులతో పోల్చుకుంటే క్షేత్రస్థాయి రాజకీయ ఎత్తుగడల విషయంలో కేవీపీ మూడాకులు ఎక్కువే చదివారు.వై.ఎస్ హయాంలో రాజకీయ నిర్ణయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. ఏమైతేనేమి ..విభజన నిర్ణయంతో ఏపీ లో తాను మునిగిన కాంగ్రెస్

kishorయూపీ లో కేవీపీ ని తేల్చి ఓ మంచి పనే చేసింది.రంగంలోకి దిగిన వెంటనే కేవీపీ ఓ వ్యూహం రూపొందించారట.అది అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న అఖిలేష్ కన్నా మాయ నేతృత్వంలోని బీఎస్పీ తో పొత్తు మేలని రాహుల్ తో పాటు అయన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కూడా ఒప్పించారట.అటు మాయ తోను సంప్రదింపులు మొదలెట్టారట.ఏదేమైనా కేవీపీ వ్యూహాలు ఏ మాత్రం పనిచేసినా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనా విధానంలో ఎంతోకొంత మార్పు వస్తుంది.అదే జరిగితే కురువృద్ధుల్ని వదిలించుకుని రాజకీయ పోరాటయోధులతో కాంగ్రెస్ సైన్యం సిద్ధమవుతుంది.నిజంగా క్షేత్రస్థాయి వ్యూహకర్తలకి పెద్దపీట వేస్తేనైనా కాంగ్రెస్ కి పూర్వవైభవం వస్తుందేమో చూడాలి.

mayavathi uttar pradesh

SHARE