కాంగ్రెస్,వైసీపీ జట్టు కట్టినట్టే…కేవీపీ సక్సెస్?

 Posted October 25, 2016

kvp combined ysrcp party congress party
2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదా అంశమేనని తేల్చిచెప్పి రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయో వైసీపీ అధినేత జగన్ చెప్పకనే చెప్పారు.హోదానే ఎన్నికల నినాదం అయితే ఏ జాతీయ పార్టీ అండ లేకుండా ముందుకెళ్లడం సాధ్యం కాదని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు.వున్నది రెండే జాతీయ పార్టీలు.. అధికారంలో ఉన్న బీజేపీ హోదా సాధ్యం కాదంటోంది.ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సై అంటోంది.అంటే కాంగ్రెస్ తో వైసీపీ చేతులు కలపడం తప్పదన్న మాట.

ఇది జగన్ స్వయంగా ఇష్టపడి తీసుకున్న నిర్ణయం కాకపోయినా అందుకు అంగీకరించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.జగన్ ని దగ్గరకు తీసే భాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ కేవీపీ కిఅప్పజెప్పినట్టు తెలుస్తోంది.జగన్ తొలుత ఈ ప్రతిపాదనకు నిరాకరించినా ప్రత్యామ్న్యాయం కనిపించక మళ్లీ హస్తం వైపు చూస్తున్నట్టు సమాచారం.ఈ సంధి దశలోనే హోదా అంశాన్ని జగన్ వదిలేశారు.2019 పై నిర్ణయించుకున్నాక ఓ నెలైనా గడవక ముందే హోదానే ఎన్నికల నినాదామని ప్రకటించారు.ఈ అంచనాలు నిజమైతే ఏపీ లో కేవీపీ వ్యూహం సక్సెస్ అయినట్టే.

SHARE