ప్యాకేజ్ కి ఎసరు పెడుతున్న కాంగ్రెస్..

kvp-speechఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం మూలన పడినట్టే అనుకున్న టైంలో రాజకీయ మేధావి ,కాంగ్రెస్ ఎంపీ కేవీపీ వేసిన ఎత్తు భలే పారింది.రాజ్యసభలో అయన పెట్టిన ప్రైవేట్ బిల్లుతో మోడీ సర్కార్ మీద ఒత్తిడి పెరిగిన మాట వాస్తవం.హోదాకి విముఖంగా ఉన్న కేంద్ర సర్కార్ ప్యాకేజ్ పై కసరత్తు చేస్తోంది.అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది.జనం మనసులో హోదా సెంటిమెంట్ బలంగా వున్నా కనీసం ప్యాకేజ్ అయినా వస్తుందన్న ఆశ వుంది .పరిస్థితులు ఆ దిశ గానే కనిపిస్తున్నాయి.ఈ సమయంలో పోలవరం మీద మాట్లాడిన కేవీపీ బీజేపీకి బాబు బూచి చూపే ప్రయత్నం చేశారు.ప్యాకేజ్ ఇచ్చాక ….కావాల్సిన లబ్ది పొందాక బాబు nda నుంచి బయటకి వస్తారని కేవీపీ చేసిన వ్యాఖ్యలు చూసాక ఈయన ఆంధ్రాకి ఆదుకోవద్దని కేంద్రాన్ని కోరుతున్నట్టు లేదా?

కేవీపీ రాజకీయ ఎత్తులు అంతటితో ఆగిపోలేదు.అప్పటికీ ప్యాకేజ్ ఇస్తారన్న భయం ఉందేమో ఆయనకి …అందుకనే మరో బాంబు కూడా పేల్చారు.బాబు ఘటనాఘటన సమర్ధుడు …ప్రధాని ,రాష్ట్రపతి ఎంపికలో పాత్ర పోషించినవాడు ….పైగా భవిష్యత్ లోప్రధాని పదవికి పోటీదారు అంటూ మోడీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.ఇదంతా బాబుని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నంలో భాగం కావచ్చు.కానీ ఆ దెబ్బ బాబు కన్నా సామాన్య ఆంధ్రుడి పొట్ట కొడుతుందన్న విషయం కేవీపీ కి తెలియదా ? ఈ ప్రయత్నాలు సఫలమైతే మరోసారి ఆంధ్ర కుత్సిత రాజకీయ ఉచ్చులో చిక్కుకుంటుంది.ఇప్పటికే విభజన తో ఆంధ్రాకి చావుదెబ్బ కొట్టి తాను కూడా చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ ఇకనైనా క్షుద్ర రాజకీయాలు ఆపితే మేలు..అన్ని తెలిసి కూడా మీరు నిద్ర నటించవచ్చు గానీ…ప్రజలు నిద్రపోవడం లేదు ..అన్నీ చూస్తున్నారు..అందర్నీ గమనిస్తున్నారు …తస్మాత్ జాగ్రత్త !

SHARE