కేవీపీ vs జగన్ ..మామ అల్లుళ్ళ సవాల్?

0
1943

kvp vs jagan ysr

     ఒకరు వై.ఎస్ ఆత్మ …మరొకరు వై.ఎస్ కుమారుడు ..ఈ ఇద్దరు పిలుచుకునే వరసలు మామఅల్లుళ్ళు …ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా తలపడే అవకాశం ఉందా? కాంగ్రెస్ అధిష్టానం ఆ పరిస్థితులు కలిపిస్తున్నట్టు వుంది .ప్రైవేటు బిల్లు ద్వారా కేవీపీ ఆంధ్ర ప్రదేశ్ జనం నోళ్ళలో కాంగ్రెస్ ప్రస్తావన తేగలిగారు .దక్షిణాదిలో పార్టీ పుంజుకోవాలంటే ఆంధ్ర కీలకం అని భావిస్తున్న కాంగ్రెస్ హోదా అంశంలో పట్టు జారకుండా చూడాలనుకుంటోంది .అవసరం అయితే కేవీపీ ని పీసీసీ అధ్యక్షుడిగా చేయడానికి కూడా రెడీ గా వుంది.ఈ వ్యూహం వల్ల వైఎస్ అభిమానులు కూడా తిరిగి కాంగ్రెస్ వైపు చూడాలని ఆశిస్తోంది .ఎవరు ఏ పార్టీ లో వున్నా వైఎస్ అభిమానులంతా కేవీపీ ని కూడా గౌరవిస్తారు .ఇదే హైకమాండ్ ఆలోచన కూడా..జగన్ నికూడా మళ్ళీ పార్టీ లోకి ఆకర్షించడానికి కేవీపీ మంత్రం పనిచేయొచ్చని 10 జనపథ్ ఐడియా .

    ఈ వ్యూహాలు అమల్లోకి వస్తే జగన్ కి ఇబ్బందులు తప్పవు .కాంగ్రెస్ పుంజుకుంటే జరిగే నష్టం తనకే అని జగన్ వూహించగలరు .కేవీపీ ని నేరుగా ఢీకొట్టడం కూడా అంత తేలికగాదు.అయితే ఏ పరిస్థితుల్లో అయినా పోరాట పంధా ఎంచుకొనే జగన్ ని కూడా తక్కువగా అంచనా వేయలేము.కాంగ్రెస్ వ్యూహాలు రెడీ కాగానే బంతి జగన్ కోర్టులో వచ్చిపడుతుంది .బీజేపీ కి ఎటూ దూరం తప్పదు కనుక …మళ్ళీ కాంగ్రెస్ తో సఖ్యతగా వుండడమా ? లేక మామ కేవీపీని ఢీకొట్టడమా ? జగన్ భవిష్యత్ వ్యూహాల్ని బట్టే రాష్ట్ర రాజకీయ రేఖాచిత్రం స్పష్టం అవుతుంది .

 

 

Leave a Reply