కాటమ రాయుడికి హీరోయిన్ల కొరత ..!

Posted November 20, 2016

 

pavankalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒకేసారి నలుగురు హీరోయిన్లను వెతకాల్సి వచ్చింది. అందులో ‘కాటమరాయుడు’ కథానాయికగా శ్రుతి హాసన్ ఓకే ఇక మిగతా రెండు సినిమాల కోసం కొన్ని నెలలుగా వెతుకులాట సాగుతోంది. త్రివిక్రమ్ సెంటిమెంటుగా ఇద్దరు హీరోయిన్లను అనుకుంటే.. నీశన్ దర్శకత్వంలో సినిమాకు ఒక హీరోయిన్ అవసరమైంది. చాలా రోజుల పాటు వెతికి వెతికి.. చివరికి ముగ్గురు హీరోయిన్లను ఫైనలైజ్ చేసేసినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ సినిమాకు ఆల్రెడీ ఒక కథానాయికగా కీర్తి సురేష్ ఓకే అయిపోయింది. రెండో కథానాయికగా అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’లో నటిస్తున్న పూజా హెగ్డేను అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు నీశన్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ముందు నయనతార పేరును పరిశీలించారు. తర్వాత మనసు మార్చుకుని త్రిషను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్రిష ఇంతకుముందు పవన్ తో ‘తీన్ మార్’ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి పవన్ తో నటించాల్సిన ముగ్గురు హీరోయిన్ల మీదా ఓ క్లారిటీ వచ్చిందా ..!

SHARE