హస్తినలో రూ. 435 కోట్లతో బిల్డింగ్ కొన్న మహిళ

Posted December 20, 2016

ladu baught building for 435 crores
అసలే దేశంలో నోట్లకు కరువొచ్చింది. ఈ తరుణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా ఏం బాగా లేదు. కానీ డబ్బున్నోళ్లకు ఎప్పుడైతే ఏముంది? కోట్ల రూపాయలతో కావలసినవి కొంటారు. దేశ రాజధాని హస్తినలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ ఏకంగా 435 కోట్ల రూపాయలతో ఓ బంగ్లాను కొనుగోలు చేసింది.

ఇంత కాస్ట్ లీ బిల్డింగ్ కొన్న మహిళ కచ్చితంగా రిచ్ కిడ్ అయి ఉండాలి. ఇంతకీ ఈమె ఎవరి కూతురో తెలుసా? దేశంలోనే టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ గారాలపట్టి రేణుక తల్వార్. ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో అందరూ వీవీఐపీలు ఉంటారు. ఉండేదంతా మంత్రులు, ఉన్నతాధికారులే. అలాంటి చోట 4,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను రేణుక తల్వార్ కొనుగోలు చేసింది. కమల్ తనేజా అనే వ్యక్తి నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిందామె.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇంత డబ్బును రేణుక తల్వార్ ఎలా ఇచ్చి ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంపదీసి ఈమె కూడా శేఖర్ రెడ్డి లాగే ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండువేల నోట్లను తెప్పించుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా మన దేశంలో దొరికే దాకా అందరూ దొరలే.. దొరికితేనే దొంగలు కదా!!

SHARE