రెండు తలల శిశువు…

Posted October 7, 2016

 lady born two headed baby rajasthan hospital

రాజస్థాన్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఓ అసాధారణ ఘటనకు వేదికైంది. రెండు తలలు ఉన్న శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చింది. సాధారణ కాన్పుతోనే  శిశువు జన్మించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం తలల మాత్రమే వేరుగా ఉన్నా శరీరంలోని కాళ్లూ, చేతులూ, ఇతర అవయవాలు  సాధారణంగానే ఉన్నాయి. మంచి బరువుతో ఆరోగ్యంగానే జన్మించిన శిశువు 32 గంటలు గడవక ముందే చనిపోయింది. డాక్టర్ల సూచనలను శిశువు తల్లీదండ్రులు పట్టించుకోలేదు. శిశువు ఆరోగ్యంగానే ఉందని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో శిశువు మరణించింది. శిశువు పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉందని, శ్వాస తీసుకోవడంతో చిన్న సమస్య ఉందని, తల్లిదండ్రులు మాటవినకపోవడంతో  శిశువు మరణించిందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రెండు తలలున్న శిశువుని చూసిన డాక్టర్లు, విద్యార్థులందరూ ఆశ్యర్యపోయారు                         

SHARE