మాజీ మహిళా మంత్రులు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

0
265
lady ex ministers on screen after long gap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

lady ex ministers on screen after long gapవైఎస్ హయాంలో చక్రం తిప్పిన మాజీ మహిళా మంత్రులు తొలిసారి ప్రజాసమస్యలపై స్పందించారు. మూడేళ్లుగా సైలంట్ గా ఉన్న ఈ సీనియర్ నేతలు.. సరిగ్గా స్త్రీలకు సంబంధించిన సమస్యలో రంగంలోకి దిగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో కొన్నాళ్లుగా వరుసగా ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఇంతవరకూ కాంగ్రెస్ మహిళా నేతలెవరూ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ ఉన్నట్లుండి డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పేట్ల బుర్జు ఆస్పత్రిని సందర్శించారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సమీక్షించారు. సర్కారు దవాఖానాల్లో ఉన్న వాస్తవ స్థితిగతులపై ఆరా తీశారు. రోగులకు ఇవ్వాల్సిన మందులే సరఫరా చేయలేకపోతున్న ప్రభుత్వం.. ఇక బేబీ కిట్లు, ఆ కిట్లు ఈ కిట్లంటూ కబుర్లు చెబుతోందని మహిళా నేతలు విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయని మండిపడ్డారు. ఇక్కడ అధికారులు ఆస్పత్రుల్లో ఏమీ లేవని చెబుతున్నారని మండిపడ్డారు మహిళా నేతలు.

ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని కూడా ఆరాతీశారు మహిళా నేతలు. అయితే ఇన్నాళ్ల తర్వాత మహిళా కాంగ్రె్స్ నేతలు యాక్టివేట్ అవడం టీఆర్ఎస్ లో కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ లో పేరున్న మహిళా నేతలంటూ ఎవరూ లేరు. కవిత ఉన్నా.. ఆమె కేసీఆర్ కూతురు కాబట్టే యాక్టివ్ గా ఉన్నారు. కానీ మహిళా ఎమ్మెల్యేలెవరూ ఫైర్ బ్రాండ్లుగా లేరు. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేతల్ని దీటుగా ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ లో కూడా ఆ స్థాయి నేత కావాలి. అందుకే ఇప్పటికైనా టీఆర్ఎస్ మహిళా మంత్రి నియామకంపై దృష్టి పెట్టాలని రాజకీయ వేత్తలు సూచిస్తున్నారు. అయితే అటు కాంగ్రెస్ క్యాడర్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది.

Leave a Reply