Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు,అభివృద్ధి తప్ప కొన్నాళ్లుగా సర్వేల మాటకి దూరంగా వుంటూ వచ్చారు సీఎం చంద్రబాబు.అలాంటి బాబు నిన్న పార్టీ సమన్వయ కమిటీ భేటీలో 2018 నవంబర్ లో ఎన్నికలు ఉండొచ్చని చెప్పడమే కాకుండా తాజా సర్వే లో పార్టీల బలాబలాల గురించి కూడా వివరించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ బలం 16 శాతానికి పైగా పెరిగిందని,వైసీపీ బలం దాదాపు 13 శాతం తగ్గిందని చెప్పారు.బాబు హఠాత్తుగా ఈ సర్వే వివరాలు చెప్పడానికి మూడు నాలుగు రోజుల ముందు ఎన్నికల ఫలితాల్ని అంచనా వేయడంలో ఆంధ్ర ఆక్టోపస్ గా గుర్తింపు వున్న లగడపాటి రాజగోపాల్ ఆయనతో భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే.
టీడీపీ తరపున వివిధ సర్వే టీం లు పని చేస్తున్నప్పటికీ ,లగడపాటి సర్వే, అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు బాబు ఈ భేటీ లో ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.2019 ఎన్నికల గురించి వారిద్దరి మధ్య విస్తృతంగా చర్చలు సాగాయట.ఆ తర్వాత పవర్ ప్లాంట్స్ ఒప్పందాలకు సంబంధించి సీఎం ముందు లగడపాటి కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం.ఏదేమైనా లగడపాటి భేటీ తర్వాత టీడీపీ బలం మీద బాబుకి విశ్వాసం పెరిగిందట.అదే ఊపులో ఆయన ఈ విషయాన్ని పార్టీ శ్రేణులతో పంచుకున్నారట.